‘మేడమ్’ కనెక్ట్ అయితే పెళ్లికి ఓకే: విజయ్ దేవరకొండ

అమ్మాయిల కలల రాకుమారుడు అయిపోయాడు ఒకప్పటి అర్జున్ రెడ్డిగా సందడి చేసిన తాజా గీత గోవిందుడు విజయ్ దేవరకొండ. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ ఇంతకు ముందు 40 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలనుకున్నానని కానీ ఇప్పుడు 35 కే చేసుకోవాలని మనసు మార్చుకున్నానన్నాడు.

గీత గోవిందం ఎఫెక్టా అంటే అవుననే సమాధానమిచ్చాడు. మరో విషయం ఏంటంటే అమ్మానాన్న కుదర్చిన అమ్మాయి నా మైండ్ సెట్‌కి అస్సలు సూటవదంటూ.. తనతో ప్రేమలో పడిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. దేవరకొండ మనసు దోచుకున్న అమ్మాయి ప్రపంచంలో ఎవరైనా కావచ్చంటున్నాడు. ఒకరికొకరు తెలుసుకోవాలి.. బాగా కనెక్ట్ కావాలి అని తన కలల రాణి గురించి చెప్పుకొచ్చాడు. అంతకు మించిన కోరికలేవీ లేవంటూ విజయ్ తన మనసులో మాటని బయటపెట్టాడు. సో.. ఎక్కడ ఉందో ఆ గీత.