ఉద్యోగాల్లో భారీగా కోతలు..80 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!

ఆటోమేషన్ పుణ్యమాని ప్రపంచ పరుగెడుతోంది. రోజుల్లో కావల్పిన పని గంటల్లో పూర్తవుతుంది. మనుషులతో పనే లేకుండా.. యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడం ట్రేండ్‌గా మారిపోతుంది. ఇప్పుడు ఈ సంకేతిక పరిజ్ఞానమే ఉద్యోగుల కడుపుకోడుతున్నాయి.అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలుతమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తాజా అధ్యయనం ఒక్కటి హెచ్చరించింది. ముఖ్యంగా ఆర్థిక, విద్య, వైద్య, రవాణా, పర్యాటకం రంగంల్లో ఉండే ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని అధ్యయనం తేలిపింది