కరకట్టపై కారు ప్రమాదం…ఎస్సై గల్లంతు

అవనిగడ్డ- విజయవాడ కరకట్టపై పాపవినాశనం దగ్గర పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. కారును డ్రైవ్ చేస్తున్న రామచంద్రపురం ఎస్సై గల్లంతయ్యారు. రామచంద్రపురం నుంచి అవనిగడ్డకు వస్తున్న కారు అదుపుతప్పి కరకట్టపై నుంచి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సై కోట వంశీతో పాటు ఆయన తల్లి ఉన్నారు. స్థానికులు అప్రమత్తం అవటంతో మహిళలను రక్షించగలిగారు. గల్లంతైన ఎస్సై కోట వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -