చిన్నారుల కోసం సరి కొత్త స్మార్ట్ ఫోన్

kids smart phone

చిన్నారుల కోసం సరి కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్‌లోకి వచ్చేసింది. ఇనోవస్ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీ ఈజీఫోన్ స్టార్ పేరిట ఈ సరి కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. భారత్‌లో చిన్నారుల కోసం విడుదలైన మెదటి ఫోన్ ఇదే కావడం విశేషం. తల్లిదండ్రులు నియంత్రించగలిగే విధంగా సరికొత్త ఫీచర్లతో చిన్నారులకు ఉపయోగపడేలా ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించారు. ఈ ఫోన్‌లోఉన్న జీపీఎస్ ద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారులను ట్రాక్ చేయవచ్చు. ఇందులో ఉన్న ఫీచర్ల ద్వారా తల్లిదండ్రులు ఈ ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్‌లకే చిన్నారులు ఫోన్ చేసుకోగలుగుతారు. దీనిలో ఉన్నకేర్ టచ్ సదుపాయం వల్ల ఒకసారి సెట్టింగ్స్ చేస్తే మళ్లీ వాటిని మార్చడం కుదరదు. 5 కలర్ వేరియెంట్లలో ఉన్న ఈ ఫోన్ ధర రూ.3,490గా నిర్ణయించారు.