ప్లిప్‌కార్ట్ గంట గంటకూ ప్లాష్ సేల్.. ఈ ఒక్కరోజు మాత్రమే..

వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ మరో బంపర్ ఆఫర్‌ని తీసుకువచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తోంది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్‌లు వంటి వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు జరిపిన వారికి 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, కెమేరాలు, బ్లూటూత్ స్పీకర్‌లు వంటి వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌లు ఇస్తోంది. గంట గంటకూ ప్లాష్ సేల్ పేరుతో టీవీలు, మొబైల్ ఫోన్‌ల వంటి వస్తువులకు అవకాశం కల్పించారు. ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు కొన్ని గంటలముందు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ సేల్‌లో మరి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ప్రవేశపెడుతున్నారు.