అతను నాకు ఏడు రోజులు అన్నం పెట్టలేదు : హీరో జగపతిబాబు

hero jagapathibabu reveals his intresting information

‘జగపతిబాబు’ ఈ పేరంటే ముందుగా గుర్తుకు వచ్చేది.. ఫ్యామిలీ చిత్రాల హీరో అని. టాలీవుడ్ లో పెద్ద నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ కొడుకుగా కెరీర్ ను ప్రారంభించిన జగపతిబాబు. మొదట్లో అంతగా నిలదొక్కుకోలేకపోయారు. అయన సినిమాలకు అసలు పనికిరాడని హేళన చేశారు. కానీ క్రమంగా ఆ అభిప్రాయాల్ని తుడిచిపెట్టేసి అగ్రనటుల సరసన చేరారు. కెరీర్ ప్రారంభ దశలో ఎక్కువగా మాస్ క్యారెక్టర్లు చేసిన ఆయన.. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా మారిపోయారు. పెద్దరికం, శుభలగ్నం, ఫ్యామిలీ సర్కస్, శుభాకాంక్షలు, పెదబాబు, శివరామరాజు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే.. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇట్టే ఒదిగిపోయే నటుడు జగపతిబాబు. చిన్నాపెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి పాత్రను చేస్తున్నాడు. హీరోగా మంచి సక్సెస్ ను చూసిన జగపతి.. ప్రతినాయకుడు పాత్రలో కూడా మెప్పించారు. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ చిత్రంలో ప్రతినాయకుడు పాత్రలో అద్భుతంగా నటించారు.

ఆ తరువాత ‘నాన్నకు ప్రేమతో’ , ‘కరెంట్ తీగ’లో అదే తరహా పాత్రలు చేశారు. మరోవైపు ‘శ్రీమంతుడు’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’లో తండ్రి పాత్రల్లో కనిపించారు. స్టోరీతో సంబంధం లేకుండా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని నిరూపించుకున్నారు. అలాంటి జగపతిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.. సినిమా ఇండస్ట్రీలో వారసత్వం పనికిరాదన్న ఆయన.. తాను ఓ అగ్ర నిర్మాత కొడుకునన్న విషయాన్ని కూడా గ్రహించకుండా.. ఓ నిర్మాత తన కెరీర్ మొదట్లో ఏడురోజులపాటు నాకు అన్నం పెట్టలేదు, పైగా కూర్చోడానికి కుర్చీ కూడా వెయ్యలేదని అన్నారు. ఒకప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న తనకు ప్రస్తుతం 13 సినిమాలు తన చేతిలో ఉన్నాయన్నారు. చిన్నప్పటినుంచి తనకు డబ్బు అంటే పెద్దగా ఇష్టం లేదని.. డబ్బుకు వాల్యూ ఇవ్వడం మరచిపోయానని అన్నారు. కుమార్తె పెళ్లి సమయంలో తన వద్ద డబ్బు లేదనీ, అయినా ఘనంగా చేయలేకపోయానన్న బాధ ఏమీ లేదని జగపతి బాబు చెప్పారు. ఒకానొక సమయంలో తనకు సినిమా అవకాశాలు లేని సమయాల్లో.. అవకాశాలు వస్తాయేమోనన్న కారణంతో ల్యాండ్ ఫోన్ సైతం చేత్తో పట్టుకుని తిరిగేవాడినని వెల్లడించారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -