జగ్గూభాయ్‌ బయోపిక్ టైటిల్ ఇదేనా?

ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో ఎవరంటే టక్కున చెప్పే పేరు ‘జగపతిబాబు’. స్టార్‌ వారసుడిగా సినీ ఇండ్రస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి కెరీర్‌ పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. సినిమాలకు అసలు పనికిరాడని హేళన చేసిన వారే ముక్కున వేలేసుకునేలా ఎదిపోయాడు ఈ విలక్షణ నటుడు. కెరీర్ ప్రారంభ దశలో ఎక్కువగా మాస్ క్యారెక్టర్లు చేసిన ఆయన.. ఆ తరువాత ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇక వెండితెరపై కెరీర్‌ ముగిసినట్టే అనుకుంటున్న సమయంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ చిత్రంలో విలన్‌ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తరువాత జగ్గూభాయ్‌గా టర్న్‌ తీసుకొని ప్రతినాయకుడిగా ఫుల్‌ఫాంలో దూసుకుపోతున్నాడు. ఓ వైపు విలన్ క్యారెక్టర్‌లు.. మరోవైపు తండ్రి పాత్రలు పోషిస్తున్నా.. ఈ హీరో జీవితంలో సినిమా రూపొందించేందుకు కావాల్సినన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి.

కెరీర్ పరంగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌.. వ్యక్తిగతంగా అనుకోని సంఘటనలు ఇలా సినిమాకు కావాల్సినంత మసాలా ఆయన జీవితంలో చవి చూసాడు. అందుకే ఆయన కథను బయోపిక్‌ గా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్తలు సినీ ఇండ్రస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మరో విశేషం ఏంటంటే ఈ బయోపిక్‌ని సినిమాగా కాకుండా వెబ్‌ సిరీస్‌ తరహాలో తెరకెక్కిస్తున్నట్టుగా వదంతులు వినిపిస్తున్నాయి. జగ్గూభాయ్‌ బయోపిక్ తెరకెక్కితే ‘సముద్రం’ అనే టైటిల్‌ బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ బయోపిక్ ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి మరి.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -