68 ఏళ్ల క్రితమే సెల్ఫీ తీసుకున్న ప్రఖ్యాత భారతీయ గాయని

lata-mangeshkar-took-her-first-selfie

మారుతున్న కాలానికనుగుణంగా టెక్నాలజీలో కూడా కీలక మార్పులు చోటుచేసుకుంటున్న ఉదంతాలు ప్రత్యక్షంగా చూస్తున్నాం.. ఐదేళ్ల వరకు వేరే వ్యక్తి తీస్తేగాని ఫోటో దిగడానికి అవకాశం లేదు. అలాంటిది ఇంకోవ్యక్తి అవసరం లేకుండా ఫోటో తీసుకునే సౌలభ్యం ప్రస్తుతం వాడకంలో ఉంది. దాని పేరే సెల్ఫీ.. ఈ సెల్ఫీ అన్న పదం నేడు సర్వసాధారణమైంది. రోజుకో సెల్ఫీ దిగనిదే యూత్ కు నిద్ర పట్టేలా లేదు. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కూడా సెల్ఫీ అనే పదాన్ని 2013లో చేర్చారు. అయితే 1950లోనే సెల్ఫీ తీసుకున్నారు ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌. ఈ విషయాన్నీ స్వయంగా ఆమె తెలియజేశారు. అప్పట్లో ఆమె తీసుకున్న సెల్ఫీని సామజిక మాధ్యమాల్లో షేర్ చేసి.. ‘నమస్కారం. దాదాపు 68 ఏళ్ల క్రితమే నేను సెల్ఫ్‌ క్లిక్డ్‌ ఫొటో తీసుకున్నాను. ఇప్పుడు దీన్నే సెల్ఫీ అంటున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చారు.