కాళ్లు, చేతులు నరికి బ్యూటీషియన్‌పై హత్యాయత్నం

hands are cut off and the killing attempt beautician in vijayawada

కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో దారుణం జరిగింది. ఓ బ్యూటీషియన్‌పై హత్యాయత్నం స్థానికంగా కలకలం రేపుతోంది. బ్యూటీషియన్‌ కాళ్లు కట్టేసి చేతులను దారుణం నరికేశారు దుండగులు. తీవ్రంగా గాయపడ్డ పద్మను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్‌లోని వైష్ణవి బ్యూటీ పార్లర్‌ను పిల్లి పద్మ అనే వివాహిత నిర్వహిస్తోంది. అయితే… ఆమెకు ఇదివరకే సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికీ ఇద్దరు సంతానం. కాగా… భర్తతో విబేధాల కారణంగా అతనికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో పద్మకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం ఓ ఇంట్లో కాళ్లు, చేతులు నరికి.. రక్తపు మడుగులో పద్మ కొన ఊపిరితో ఉన్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే దాడికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -