కళ్లు చెదిరే రాఖీలు.. ఖరీదు లక్షల్లో కూడా..

రక్షాబంధన్ సందర్భంగా మార్కెట్లోకి రకరకాల రాఖీలు వచ్చాయి. కళ్లు చెదిరే రాఖీలు అక్కచెల్లెళ్లను ఆకర్షిస్తున్నాయి. అన్నకు ఓ మంచి రాఖీని కట్టి తన ప్రేమను తెలియజేయాలనుకుంటుంది చెల్లి. మరి ఇప్పుడు మార్కెట్లో వందలు, వేలు దాటి లక్షల్లు ఖరీదు చేసే రాఖీలు వచ్చి అక్క చెల్లెళ్లను కొనమంటున్నాయి. దేశంలోని కోల్‌కతా, రాజ్‌కోట్, కటక్ మార్కెట్లో ఈ ఖరీదైన రాఖీలు విక్రయిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని ప్రముఖ మార్కెట్ సర్వఫా బజార్‌లో రూ.12లక్షలు ఖరీదు చేసే రాఖీల గురించి దేశమంతా మాట్లాడుకుంటోంది. బ్రాస్‌లెట్ రూపంలో తీర్చిదిద్దిన రాఖీలకు కోయంబత్తూర్ సొగసులను అద్దారు. ఇప్పటికే మార్కెట్లో చలామణిలో ఉన్న బంగారం, వెండి రాఖీలకు తోడు డైమండ్ రాఖీలు కూడా ఈసారి సందడి చేయబోతున్నాయి.