నీకెవరన్నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడా.. నమ్మొద్దు..

king, nagarjuna, arvindswamy

‘దళపతి’, ‘నాయకుడు’ వంటి యాక్షన్ సినిమాలను క్లాసిక్స్‌గా మలిచిన దర్శకుడు మణిరత్నం. ‘గీతాంజలి’ మూవీతో మ్యాజిక్ చేసి తెలుగు అభిమానుల్లో చెరగని ముద్ర వేసిన డైరక్టర్ మణిరత్నం. తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ‘సెక్క సివంద వానం'(తెలుగులో నవాబ్). గత కొంతకాలంగా నవాబ్ ప్రచారంలో భాగంగా ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీని భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు. శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్ ‌స్వామి, అరుణ్‌ విజయ్‌, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్‌, అదితి రావ్‌ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా నవాబ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేశాడు. ‘నాకు ‘గీతాంజలి’ ఇచ్చిన వ్యక్తి మణిరత్నం మరోసారి మ్యాజిక్‌ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ‘నవాబ్‌’ ట్రైలర్‌ను చూడండి’ అని ట్వీట్‌ కూడా చేశాడు నాగ్.

ఇక ట్రైలర్‌లో సంభాషణలు అందరని ఆకట్టుకుంటున్నాయి. ‘ఈరోజున క్రిమినల్స్‌కు చాలా పేర్లు ఉన్నాయి.. పారిశ్రామిక వేత్త, విద్యావేత్త, రియల్‌ఎస్టేట్‌ కింగ్‌ పిన్‌, ఇసుక మాఫియా‌, భూపతిరెడ్డి..’ అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను పరిచయం చేశారు. దీంతో ఈ మూవీ మాఫియా నేపథ్యంలో ఉండబోతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. ‘అప్పుడు యుద్ధమేగా.. మీ నిర్ణయం అదేనా..?’ అని జ్యోతిక అరవింద్‌ స్వామిని ప్రశ్నించడం ఆసక్తిని కల్గిస్తుంది. ‘నీకెవరన్నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉన్నాడా?.. నమ్మొద్దు..’ అని అరవింద్‌ స్వామి తన ఫ్రెండ్ విజయ్‌ సేతుపతిని ఉద్దేశించి మరో వ్యక్తికి చెబుతుండటం ఈ మూవీపై అంచనాలను పెంచుతుంది.