వెంటపడితే ఓకే.. ‘అంతకుమించి’ నాట్ ఓకే: రష్మీ

హాట్ యాంకర్ రష్మీ వెండి తెరపై కూడా హాట్ హాట్ సినిమాలు చేస్తూ బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. ఏదైనా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పి చాలా సార్లు చీవాట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా నేనింతే అంటూ తాను నటించిన ‘అంతకుమించి’ సినిమా ప్రమోషన్‌లో మరి కాస్త అడ్వాన్స్‌గా మాట్లాడింది. నిన్న విడుదలైన ఈ చిత్రం రష్మీకి మరిన్ని ఆఫర్లు తీసుకొస్తుందో లేదో తెలియదు కానీ తనకు, యాంకర్ సుధీర్‌కు మధ్య ఉన్న ఎఫైర్ గురించిన కామెంట్స్ మళ్లీ చర్చకు వచ్చాయి.

సుధీర్‌తో మీ రిలేషన్ ఏంటి అని అడిగిన వారికి ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ‘జస్ట్ వెంట పడతాడు అంతే.. వయసులో ఉన్నవాళ్లు అమ్మాయిల వెంట పడడంలో తప్పు లేదు అంటూ సుధీర్‌ని సమర్థించింది. అలుసుగా తీసుకుని రేప్ చేయనంతవరకు ఓకే అంటూ తనదైన శైలిలో ఎక్సప్లనేషన్ ఇచ్చింది. మరి రష్మీ స్టేట్‌మెంట్‌ని ఏవిధంగా అర్థం చేసుకుంటారో నేటి యువత.