బ్యాంకు డీటెయిల్స్ ఇస్తా.. రూ.3 కోట్లు పంపు : రష్మీ

rashmi

బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ రష్మీ. ఈ అమ్మడు వెండి తెరపై అందాలు ఆరబోస్తూ కుర్రకారులకు చెమటలు పుట్టిస్తోంది. ఇటీవల విడుదలైన ‘అంతకుమించి’ మూవీలో తన హాట్ హాట్ అందాలను చూసిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ఆసక్తిర ఫోస్ట్ చేశాడు. ‘రష్మీ నువ్ సొంతంగా సినిమాలు చేసుకో.. దర్శకుల నుండి వచ్చే అవకాశాల కోసం వేచిఉండకు’ అని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది రష్మీ. ‘తప్పకుండా చేస్తా.. నా బ్యాంకు ఖాతా డీటెయిల్స్ నీకు ఇస్తా.. రూ.3 కోట్లు నాకు పంపు.. గొప్ప సహాయం చేసిన వాడివి అవుతావ్’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్‌గా మారింది.