బ్యూటీషియన్‌పై దాడి కేసు : నిందితుడి ఆత్మహత్య

attempt-murder-case-beautician-padmanutan-kumar-commits-suicide

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్‌ పిల్లి పద్మ హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఆమె ప్రియుడు నూతన్‌ కుమార్‌ ఆత్మహత్యకు చేసుకున్నాడు. పద్మపై క్రూరంగా దాడి చేసిన తర్వాత పరారీలో ఉన్న నూతన్‌ కుమార్‌ గుంటూరు-నరసరావు పేట మధ్య నడిచే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టాలపై ఆదివారం సాయంత్రం నూతన్‌ మృతదేహం లభించింది. దీంతో రైల్వే పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పట్టాల మీద నుంచి వెలికితీశారు. బ్యూటీషియన్‌ పద్మపై దాడి అనంతరం నూతన్‌ కుమార్‌ అదృశ్యమైన సంగతి తెలిసిందే. నూతన్‌ కోసం నాలుగు పోలీస్‌ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో అతను ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.