బిగ్‌బాస్ హౌస్‌లో ఊహించని సంఘటన.. దీప్తికి షాక్!

bigg-boss, depthi, nani

బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. ‘ఏదైనా జరగొచ్చు ఇంకొంచెం మసాలా’ అంటూ నేచురల్ స్టార్ నాని శనివారం ఎపిసోడ్‌ని చాలా డీసెంట్‌గా హ్యాండిల్ చేశాడు. ఇక హౌస్‌లో ఎంతో ఆశపడి కెప్టెన్సీ బాధ్యతను చేపట్టిన దీప్తికి అనుకోని సంఘటన ఎదురైంది. బిగ్‌బాస్ హెచ్చరికలు ఇస్తున్న.. వాటిని పట్టించుకోకుండ దీప్తి వ్యవహారించడంతో ఆమెకి గట్టి షాకే ఇచ్చాడు బిగ్‌బాస్.

కంటెస్టెంట్‌లు పగటి పూట నిద్ర పోవడం, మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో.. బిగ్ బాస్ చాల సార్లు హెచ్చరికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కెప్టెనే స్వయంగా మైక్‌లు ధరించకుండా మాట్లాడటంతో విసుగు చెందిన బిగ్‌బాస్‌ దీప్తిని కెప్టెన్‌ బాధ్యత నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక బిగ్‌బాస్‌ దీప్తిని కెప్టెన్‌గా తొలగించినప్పటికీ.. తానే కెప్టెన్‌ అని తాను చెప్పిందే వింటానని ఇది తన అభిప్రాయమని తనీష్‌ చెప్పడం ప్రేక్షకులకు ఆశ్చర్యం కల్గించింది.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -