ఈ పాప.. ఏం యాక్ట్ చేసింది? స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.. వైరల్ వీడియో

cute baby, kid, expressions, extraordinary, acting, vira, wiral, video, entertainment, baby girl, heroines

చిన్నపిల్లలు ఏం చేసినా అందంగానే ఉంటుంది. వినాలే కాని.. రోజంతా కబుర్లు చెబుతూనే ఉంటారు. చూడాలే కాని.. మార్చి మార్చి మరీ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూనే ఉంటారు. వాళ్ల లోకం వాళ్లది. ఎవరినైనా ఇట్టే అనుకరించేస్తారు. తమ చిలిపి చేష్టలతో పెద్దోళ్లను సైతం కట్టి పడేస్తారు. ఇక పాటలు, ఫైట్లు, డ్యాన్సులైతే అదరగొట్టేస్తారు. కాకపోతే ఇందులో కొంతమంది పిల్లల ఎక్స్ ప్రెషన్స్ ఇంకా అదిరిపోతాయి. చూస్తుండగానే.. సీన్ టూ సీన్ మారిపోతుంది. వాళ్ల ముఖ కవళికలకు సంతోషంగా నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేరు పెద్దోళ్లు.

ప్రస్తుతం నెట్ లో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ చిన్నారి.. ఓ చిన్న మ్యూజిక్ బిట్ కు అదరగొట్టేలా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. చూడ్డానికి ఈ వీడియో 15 సెకన్లే ఉంది కాని.. ఇలా స్టార్ట్ చేసి అలా చూసేసరికీ అయిపోతుంది.

ఉన్న ఆ కాసేపు.. ఈ చిన్నారి యాక్టింగ్ చూసి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. స్టార్ హీరోయిన్స్ కూడా ఈ పాప నటన ముందు బలాదుర్ అంటే నమ్మండి. అందుకే ఈ వీడియో వైరల్ అయ్యింది.