కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు : డిప్యూటీ సీఎం కేఈ

deputy cm KE krishnamoorthi comments on congress and tdp co-alliance

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని… డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. గతంలోనే తాను ఈ విషయాన్ని చెప్పానని.. అయితే దీనిపై సీఎం తనను వివరణ కోరారంటూ వచ్చిన వార్తలు అవాస్తవం అని కేఈ వివరణ ఇచ్చారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి పొత్తులపై నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే తీసుకుంటారని కేఈ స్పష్టం చేశారు.