డ్రంకెన్‌ డ్రైవ్‌లో విచిత్రం.. ట్రాఫిక్ పోలీసులపైనే రివర్స్ కేసు..

drunk-and-drive

హైదరాబాద్ డ్రంక్ అండ్ డ్రైవ్‌ చెకింగ్స్‌లో విచిత్రమైన కేసు నమోదైంది. వాహనదారులను చెకింగ్ చేస్తున్న టైమ్‌లో జహీరుద్దీన్ అనే వ్యక్తికి రీడింగ్ 43 పాయింట్లు చూపించింది. అతనిపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే.. తాను మద్యం తాగలేదని సయ్యద్ వాదించాడు. కావాలంటే రక్త పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమన్నాడు. ఈ విషయంపై పోలీసులకు- అతనికి మధ్య వాగ్వాదం జరిగింది. తాను తాగలేదని చెప్తున్నా వినకుండా కేసు ఎలా పెడతారంటూ గొడవకు దిగాడు. సుల్తాన్ బజార్ పీఎస్‌లో ట్రాఫిక్ వాళ్లపైనే కేసుపెట్టాడు. అతను తాగాడో లేదో నిజానిజాలు నిర్థారించేందుకు ఉస్మానియా ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. తీరా అందులో అన్నీ నార్మల్ రావడంతో అవాక్కవడం పోలీసుల వంతయ్యింది.

తాను ఐదు పూటలా నమాజ్ చేస్తానని, తనకు మద్యం అలవాటు లేదని సయ్యద్ జహీరుద్దీన్ చెప్తున్నాడు. ఐతే.. చెకింగ్స్ సమయంలో మీటర్ 43M.G ఎందుకు చూపిందన్నది పెద్ద చర్చనీయాంశమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల కోసం వాడుతున్న మెషీన్లు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్న సందేహం కలుగుతోంది.

-ADVT-