సినిమా హాల్‌లో తండ్రికి దొరికిపోయిన లవర్స్‌.. కూతురిని తండ్రి ఏం చేశాడో చూస్తే..

father catched lovers in cinema theater

చదువుకోమని పంపిస్తే ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందో యువతి. అనూహ్యంగా తండ్రికి దొరికింది. దీంతో తండ్రికి ఒళ్ళు మండి చితకబాదాడు. ఈ ఘటన వరంగల్ లోజరిగింది. ఫెస్టివల్ మూడ్.. పైగా సండే.. కావడంతో ప్రేమికులిద్దరు సరదాగా s2 సినిమా హాల్ కు వచ్చారు. టికెట్ తీసుకుని సినిమా హాల్లోకి వెళ్లారు. అయితే అంతలోనే సీన్ కాస్త రివర్స్ అయింది. బ్యాడ్ లక్ వెనకనే వెంటాడింది. అదే సినిమాకు యువతి తండ్రి అదే సినిమా హాల్లో వెనకాలే కూర్చున్నాడు. అయితే కొద్ది సేపటి తరువాత ముందు కూర్చున్న యువతి తన కూతురేనని గుర్తించాడు. అంతే తన కూతురు ప్రేమికుడితో కలిసి సినిమాకు వచ్చిందన్న కోపాన్ని తండ్రి తట్టుకోలేక పోయాడు. వెంటనే కూతురిని బయటవరకు ఈడ్చుకుంటూ వచ్చి తీవ్రంగా కొట్టాడు. చదువుకోమని పంపిస్తే లవర్ తో కలిసి సినిమాకు వస్తావా అంటూ కూతురును చావబాదాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన ప్రేమికుడిని కూడా చితక్కొట్టాడు.