టీమిండియా మాజీ క్రికెటర్ మృతి

former-india-player-and-bengal-stalwart-cricketer-gopal-bose-passes-awa

టీమిండియా మాజీ క్రికెటర్, బెంగాల్ క్రికెట్ దిగ్గజం గోపాల్ బోస్(71) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం బర్మింగ్‌హామ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బోస్.. బెంగాల్ రంజీ క్రికెట్లో చోటు సంపాదించారు. తన ప్రతిభతో 1973-74లో భారత జట్టులో చోటు సంపాదించారు. శ్రీలంక పర్యటనలో సునీల్ గవాస్కర్‌తో కలిసి మంచి స్కోర్ ఇచ్చాడు. ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో ఆయన జట్టులో స్థానం కోల్పోవలసి వచ్చింది. కానీ వెస్టిండీస్‌తో 1975లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో గవాస్కర్ గాయపడటంతో మళ్లీ బోస్‌ను జట్టులోకి తీసుకున్నారు. 2008లో విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. ఆ సమయంలో ఇండియా జట్టుకి మేనేజర్‌గా పని చేశారు. కాగా బోస్ మృతిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.