దుర్గమ్మ క్షేత్రం.. చిన్నారులకు పాలు.. భక్తులకు అప్పాలు..

duga-temple

సామాన్య భక్తుల సేవే.. దుర్గమ్మ సేవ అంటోంది దుర్గగుడి పాలక మండలి. ఇకపై దుర్గమ్మ దర్శనానికి వచ్చే చిన్నారులకు ఉచితంగా పాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అలాగే భక్తులకు ఉచిత ప్రసాదంగా అప్పాలు అందించనుంది. ఆలయ అభివృద్ధితో పాటు.. దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది దుర్గగుడి పాలకమండలి.

 

బెజవాడ కనదుర్గమ్మ క్షేత్రంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకోనున్నాయి.. ఈ దిశగా ఆలయ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన ఈవోగా కోటేశ్వరమ్మ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి పాలక మండలి సమావేశమైంది. దసరా ఉత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధి, చీర మాయం వివాదం, మాజీ పాలక మండలి సభ్యురాలు కోడెల సూర్యలత ఆరోపణలపై సమావేశంలో పాలక మండలి సభ్యులు చర్చించారు. అలయ అభివృద్ధి, భక్తులకు అందించే సేవలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

vijayawada durga temple new eo

భక్తుల కోసం కొండపై ఎకరా స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించింది. NRI ల సహాకారంతో మహామంటపం సహా ఇతర ప్రాంతాల్లో షల్టర్ల ఏర్పాటు చేయనుంది. అలాగే 32 సీసీ కెమెరాల నిర్వహణకు టెండర్లను పిలవాలని నిర్ణయించింది. దసరా ఉత్సవాల సందర్భంగా 4.10 లక్షలతో లడ్డూ తయారీ క్యాబిన్ల కొనుగోలు చేయనుంది.

దసరా ఉత్సవాలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నట్లు ఈవో కోటేశ్వరమ్మ తెలిపారు. దసరా ఉత్సవాల కోసం నాలుగు లక్షల రూపాయలతో లడ్డూ తయారీ కేబిన్ల కొనుగోలు చేయనుంది. ఉత్సవాల్లో అమ్మవారి ప్రసాదంగా భక్తులకు ఉచితంగా అప్పం అందించే ఆలోచనలో ఉన్నట్లు ఈవో చెప్పారు. ఇకపై పసి పిల్లల కోసం ఉచితంగా పాల సదుపాయం కల్పిస్తామన్నారు.

వైదిక కమిటీలో ఎవరు ఉండాలనేది అర్చకులంతా కలిసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే కోటేశ్వరమ్మ భక్తుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.