ఒంటరి వృద్ధ మహిళలే అతని టార్గెట్.. వారు కనిపిస్తే..

gold-theafe-arested-in-ongole

ఒంటరి వృద్ధ మహిళలే అతని టార్గెట్. మెడలో బంగారం ఉంటే చాలు..మాట మాట కలిపేసి..పింఛనను వస్తుందా లేదా కనుక్కుంటాడు. లేదని సమాధనం వస్తే..జాలి చూపిస్తూ ఆదుకునే వ్యక్తిలా నమ్మిస్తాడు. వెంటనే పింఛను ఫామ్ తీసుకొచ్చి లేటెస్ట్ ఫోటో కావాలంటూ అయోమయం చేస్తాడతను. తాను ఫోటో దింపుతానని..అయితే మెడలో బంగారం ఉంటే పింఛన్ రాదంటూ మాయమాటలతో మెడలోని బంగారం తీయించటం..వృద్ధులు ఆ అయోమయం నుంచి బయటపడక ముందే బంగారాన్ని ఎత్తుకెళ్లటం అతని స్టైల్. ఇలా పింఛన్ల పేరుతో వృద్ధులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.

నెల్లూరు జిల్లా దత్తలూరుకు చెందిన కొండెపోగు జీవరత్నం…బియ్యం వ్యాపారం చేసేవాడు. బిజినెస్ లో లాస్ రావటంతో ఈజీ మనీ కోసం మోసాలకు తెగబడ్డాడు. మకాం బెంగళూరుకు మార్చి..ఏపీలోని ప్రకాశం, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డాడు. పింఛన్ వస్తుందనే ఆశతో జీవరత్నాన్ని నమ్మి మోసపోయిన వృద్ధులు పోలీసులను ఆశ్రయించారు. ప్రకాశం జిల్లాలోనూ అదే తరహాలో మోసాలు జరుగుతుండటంతో అలర్టైన పోలీసులు. ఎట్టకేలకు కందుకూరు పోలీసులకు చిక్కాడతను. ఆరు లక్షల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.