కేరళకు పాముల బెడద.. ఇళ్లల్లోకి ప్రవేశించి..

huge-snakes-in -kerala-houses

పదిరోజులపాటు కురిసిన వర్షాలకు కేరళ అతలాకుతలం అయింది. ఎక్కడ చూసిన టన్నులకొద్దీ బురద పేరుకుపోయింది. దీంతో పారిశుధ్య కార్మికులకు దీన్ని తొలగించడం పెద్ద కష్టంగా మారింది. మరోవైపు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడం తోపాటు చెట్ల కొమ్మలు,చెత్త చెదారం అంతా ఇళ్లలో ఉండిపోయింది. దీంతో కేరళ వాసులు అతి కష్టం మీద ఇళ్లను శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్ని పాములు ఇళ్లలోకి ప్రవేశించాయి. వరదలతో ఇళ్లలో నక్కిన పాములను చూసి భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే పాము కాట్లతో కొందరు ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. అడవికి దగ్గరగా ఉండే ఊళ్లలో పాముల బెడద మరింత ఎక్కువగా ఉంది. వివిధ రకాల విష సర్పాలు జనాల మధ్య తిరుగుతూ.. కాటేస్తున్నాయి. కేవలం పాములే కాక కొన్ని కీటకాలు సైతం ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే కేరళ వ్యాప్తంగా భారీగా పాముకాటు కేసులు నమోదయ్యాయి. కేరళలోని ఎర్నాకులం, వ్యాపిన్, వడకర్ర, పరావూర్ ప్రాంతాల్లో పాముకాటు కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. మలప్పురం లోని ఓ ఇంట్లో ఏకంగా 100 పాములు దర్శనమిచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇళ్లల్లోకి వెళ్లే వరద బాధితులు అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలోకి వెళ్లే ముందు శబ్దం చేస్తూ వెళ్లాలని సూచిస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -