సీఎంకు అక్కడ చేదు అనుభవం

రాజస్థాన్‌ సీఎం వసుందర రాజెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె చేపట్టిన గౌరవ్‌ యాత్రలో నిరసనకారులు నల్లజెండాలు ప్రదర్శించారు. పలుచోట్ల టైర్లను కాల్చివేశారు… బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.  పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.