గల్లంతైన ఎస్సై మృతదేహం లభ్యం

si-misssing-case

కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశం వద్ద కేఈబీ కాలువలో గల్లంతైన ఎస్సై కోట వంశీధర్ మృతదేహం లభ్యమైంది. కారు బోల్తా పడిన ప్రాంతానికి 20కిలో మీటర్ల దూరంలో అన్నవరం-మంగళాపురం కాలువలో ఎస్సై మృతదేహాన్ని గుర్తించారు. కాలువలో కారు బోల్తా పడిన వెంటనే గల్లంతైన ఎస్సై కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. కానీ మృతదేహం చాలా దూరం నీటిలో కొట్టుకుపోవడంతో దాదాపు 15గంటల పాటు సహాయక చర్యల అనంతరం డెడ్‌బాడీ ఆచూకీ లభ్యమైంది.

అవనిగడ్డ- విజయవాడ కరకట్టపై పాపవినాశనం దగ్గర ప్రమాదవశాత్తు ఎస్సై కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారును డ్రైవ్ చేస్తున్న రామచంద్రపురం ఎస్సై గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎస్సై కోట వంశీధర్ తో పాటు ఆయన తల్లి ఉన్నారు. స్థానికులు అప్రమత్తం అవటంతో ఎస్సై తల్లిని రక్షించగలిగారు కానీ ఎస్సై కాలువలో గల్లంతయ్యారు.