ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

women-suiciede-with-her-children-in-janagama

జనగామలో దారుణం జరిగింది. ఓ మహిళ ఇద్దరు పిల్లలతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వీవర్స్‌ కాలనీలో నివాసముండే మాదాసు మధు.. రక్షాబంధన సందర్భంగా పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి ఇద్దరు పిల్లలతో కలిసి బయల్దేరింది. కాలనీ సమీపంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలు కిందకి పిల్లలతో సహ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని కాలనీవాసులు, బంధువులు అంటున్నారు.