బ్యూటీషియన్‌ ఒంటిపై దుస్తులు తీసి.. పాశవిక హత్యాయత్నం..

beautician-brutally-attacked-in-vijayawada

ప్రియురాలు తనను కాదన్నదన్న కోపంతో ఉన్మాదిగా మారాడు. పగ తీర్చుకోవాలన్న ఆవేశంలో రాక్షసుడి కంటే క్రూరంగా ప్రవర్తించాడు. ఆమెను టార్చర్‌ చేసి చంపాలన్న లక్ష్యంతో ముక్కలు ముక్కలుగా నరికాడు. అయితే చేసిన పాపం వెంటాడిందో.. పోలీసుల భయం వణికించిందో తెలియదు కానీ.. రైలు పట్టాలపై శవమై తేలాడు. కృష్ణా జిల్లాలో బ్యూటిషియన్‌ పద్మపై హత్యాయత్నం చేసిన నూతన్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకోవడంతో… రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది.

padma-was-injected-drugs-murder-attempt

కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన బ్యూటీషియన్‌పై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం చేసిన నిందితుడు నూతన్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 24న పద్మపై దాడి అనంతరం పోలీసులకు భయపడి నూతన్‌కుమార్‌ అదృశ్యమయ్యాడు. అతడి కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలించారు. కాగా, ఆదివారం నరసరావుపేట-గుంటూరు మార్గంలోని రైలు పట్టాలపై నూతన్‌కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్న నూతన్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ… అనేక విషయాల్లో చిక్కుముడి వీడలేదు. బాధితురాలి నుదుటిపై ఎస్ అనే అక్షరం ఎందుకు చెక్కాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూతన్‌కుమార్‌ అర్ధరాత్రి పద్మకు మత్తుమందు ఇచ్చి దాడికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ప్రియుడు నూతన్, పద్మకు మధ్య దాడి ముందు రోజు ఘర్షణ జరిగింది. భర్తతోనే ఉంటానని ప్రియుడితో వాదనకు దిగినట్లు సమాచారం. ప్రియుడుతో పాటు సుబ్బయ్య అనే వ్యక్తి కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెచ్చిపోయిన నూతన్ తాను అన్నీ వదిలేసుకుని వస్తే, తనను కాదంటుందన్న కోపంతో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీళ్లిద్దరూ సహ జీవనం ప్రారంభించిన తర్వాత నూతనకుమార్‌ వ్యవహారంతో విసుగు చెందిన పద్మ గతంలో జంక్షన్‌ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.

hands are cut off and the killing attempt beautician in vijayawada

రాజమండ్రికి చెందిన పల్లె పద్మ, సూర్యనారాయణకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కాపురంలో మనస్పర్థలు రావడంతో భర్తను విడిచిపెట్టిన పద్మ… ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది. ఓ బ్యూటీపార్లర్‌లో పద్మ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా, నూతనకుమార్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. ఇరవై రోజుల క్రితం తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో వీళిద్దరూ కలిసి అద్దెకు దిగారు. ఈనెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గర ఉంటున్న తన పెద్ద కూతురికి పద్మ ఫోన్‌లో చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె… తండ్రితో కలిసి పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గరికి శనివారం ఉదయం వచ్చింది. ఇంటి తలుపులు తీయటంతో పద్మ రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. దీంతో స్థానికుల సాయంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

attempt-murder-case-beautician-padmanutan-kumar-commits-suicide

ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురి చేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికేయడం.. కాళ్లు రెండు వైర్‌తో కట్టేసి, మళ్లీ ఆ వైర్‌ ఊడిపోకుండా ట్యాగ్‌లు వేయటం… ముఖానికి కవర్‌తో ముసుగు వేయటం చూసి పోలీసులే షాకయ్యారు. పద్మ గదిలో ఇంజక్షన్లు, సిరంజన్‌లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశంతో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆమె కోలుకుంటేనే కేసులో చిక్కుముళ్లు వీడే అవకాశముంది.