వారెవా.. ఏమి ఫేసు.. అచ్చు హీరోలా ఉంది బాసు.. అంతా ట్రాష్

-కుమార్ శ్రీరామనేని

కమెడియన్‌కి హీరో ఇమేజ్ రావడం సులువే కానీ హీరో కమెడియన్‌గా నిలదొక్కుకోవడం మాత్రం చాలా కష్టం. ఈ మద్య మన తెలుగు కమెడియన్స్‌కి ఈ విషయం అనుభవంలోకి వచ్చింది. అందుకే తమ క్రేజ్ కి వచ్చిన ఆఫర్స్‌తో ఆఖరి బంతి ఆడేందుకు సిద్ధం అయ్యారు. ముందుగా ఈ వరసలో కమెడియన్ సునీల్ ఉన్నాడు. బంతిలాగా ఉండే తన ఆకారాన్ని సిక్స్ ప్యాక్ లుగా మార్చి ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ ని సర్ ప్రైజ్ చేసిన ఈ అందాల రాముడు హీరోగా సోలో సక్సెస్ లు అందుకున్నాడు. కానీ వరస పరాజయాలు సునీల్ కెరియర్ ని నాలుగు రోడ్ల సెంటర్ లో వదిలేసాయి.

దీంతో తన ఫామ్ ని తిరిగి తెచ్చుకునే పనిలో పడ్డాడు. వరసగా ‘అరవింద సమేత వీర రాఘవ’ తో పాటు ‘అమర్ అక్బర్ ఆంథోని’ లతో రీ ఎంట్రీ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు. చివరిగా ‘సిల్లీ ఫెలోస్ ’ తో ఆఖరి బంతిని కొట్టేందుకు సిద్దం అయ్యాడు. రిలీజ్ అయిన ట్రైలర్ పంచ్ కామెడీ లతో నవ్వించింది. ఈ నవ్వులు పంచిన ఈ స్టార్ కమెడియన్ కి ‘సిల్లీ ఫెలోస్’ చివరి బంతిగా మారింది.జబర్దస్త్ కమెడియన్ అనిపించుకొని కొన్ని సినిమాల విజయాలలో కీలకపాత్ర పోషించిన షకలక శంకర్ కూడా హీరోగా మారి క్రేజ్ ని పెంచుకున్నాడు.

అయితే శంభో శంకర్ ఆశించిన ఫలితం అందించలేకపోయింది. శంకర్ లౌడ్ కామెడీ ని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు అన్ని ఎమోషన్స్ లోనూ ఆ లౌడ్ నెస్ ని భరించలేకపోయారు. అందుకే డ్రైవర్ రాముడి మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు శంకర్. టీజర్ నవ్వించింది. అతని గెటప్ కూడా ఫన్నీ గా ఉంది. మరి హీరోగా మెప్పించడం అనేది మాములు విషయం కాదు అనే విషయం ఈ పాటికే అర్ధం అయిన శంకర్ కి ‘ డైవర్ రాముడు’ ఆఖరి బంతి అయ్యింది. ఇక సప్తగిరి కూడా అదే బాటలో ఉన్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి అంటూ సినిమాలతో హీరో ట్రాక్ లోకి వచ్చిన సప్తగిరి కూడా ఆ ట్రాక్ నుండి బ్రేక్ పాయింట్ కి వచ్చేసాడు.

సప్తగిరి టైమింగ్ కామెడీకి యాప్ట్ అయినంత గా అన్ని రకాల ఎమోషన్స్ కి యాప్ట్ కాలేదు. అందుకే సప్తగిరి బ్యాక్ టు కమెడియన్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నాడు. ఆలీ, బ్రహ్మానందం, ఏవీయస్ లు కూడా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరోగా ట్రై చేసారు. ఇందులో బ్లాక్ బస్టర్ ని ‘యమలీల’ తో అందుకుంది ఆలీనే. స్టార్ డమ్ వచ్చిన కమెడియన్ హీరోగా మారడం తేలికగా జరిగే పనే అయినా, సక్సెస్ అవ్వడం.. దాన్ని కొనసాగించడం మాత్రం అంత తేలిక కాదని గత చరిత్ర కళ్లముందు కనబడుతూనే ఉన్నా ఏదో చిన్న ఆశ ప్రయత్నాలు చేయడానికి పురిగొల్పుతుంటుంది. అవి కొన్ని హిట్లు, కొన్ని ఫట్లుగా మిగిలిపోతుంటాయి. కమెడియన్‌గా సక్సెస్ చూస్తూ.. ఎవరైనా హీరోగా ట్రై చేయమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందడుగేయడం మంచిదేమో.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.