వైసీపీ నేతలకు మింగుడు పడని మాజీ డీజీపీ ప్రకటన

సెల్ఫగోల్‌కు కేరాఫ్‌గా వైసీపీ మారుతోందా?.. ఎంపీల రాజీనామా, అసెంబ్లీకి గైర్హాజరు విషయాల్లో వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమర్శల విషయంలోనూ జగన్‌ తీరును చాలామంది తప్పు పడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ భార్యల విషయంలోనూ, కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన బాటలోనే కీలక నేతలు నడుస్తున్నారు.

ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్‌ సాయి రెడ్డి జగన్‌ బాటలో నడిచారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను మాజీ డీజీసీ సాంబశివరావు కలిశారు. అయితే ఆయన త్వరలో వైసీపీలో చేరుతారని విజయ్‌ సాయి రెడ్డి వెంటనే ప్రకటించారు. ముహూర్తం కూడా నిర్ణయించినట్టు విజయ్‌ సాయి తెలిపారు.
ఆ వెంటనే సాంబశివరావు తనపై వచ్చిన వార్తలను ఖండిచారు. పోర్టు సీఈఓ హోదాలో మర్యాదపూర్వకంగా కలిశాను తప్పా.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేదని కుండబద్దలు కొట్టారు..

మాజీ డీజీపీ ప్రకటన వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఇదే విషయాన్ని విజయ్‌ సాయి రెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. ఆ విషయం సాంబశివరావునే అడగంటి అంటూ మాట దాటవేసే ప్రయత్నం చేశారు. కేవలం సాంబశివరాం తనకు మంచి మిత్రుడు మాత్రమే అంటూ.. మిడియా ప్రశ్నల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు..