బంగారం ధర దిగిరావాలంటే..!

gold

అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర ఎక్కువగా ఉండటంతో ఈ ధరను తగ్గించేందుకు కేంద్రానికి నీతి ఆయోగ్‌ సూచనలు చేసింది. నీతి ఆయోగ్‌ ముఖ్య సలహాదారు రతన్‌ పి వాతల్‌ నేతృత్వంలోని కమిటీ ఈ సిఫారసులు చేసింది. గోల్డ్‌పై దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీని కూడా విధిస్తున్నారని, దీంతో దొంగచాటుగా దేశీయ మార్కెట్లోకి బంగారం వస్తోందని, దీనిని అరికట్టేందుకు వెంటనే పన్నులను తగ్గించాల్సిందేనని సూచించింది. పసిడి నగదీకరణ, సార్వభౌమ పసిడి బాండ్ల పథకాలను కూడా సమీక్షించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బంగారంపై 10శాతం దిగుమతి సుంకం, 3శాతం జీఎస్టీని విధిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే స్మగ్లింగ్‌ను నిరోధించే అవకాశముందని తెలిపింది.