ఒరేయ్ చిన్నోడా.. పెద్దోడు నన్నేంచేస్తున్నాడో చూడు: జూనియర్ ఎన్టీఆర్

ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారు చేసే అల్లరి ఒక్కోసారి కోపం తెప్పించినా చాలా సార్లు ముద్దుగానే ఉంటుంది. పనితో అలసి పోయి ఇంటికి వచ్చిన నాన్నకు రిలీఫ్ పిల్లలు. వారు పలికే ముద్దు మాటలతో, చేసే చిలిపి చేష్టలతో నాన్న అలసట ఆ క్షణంలోనే పోతుంది. అరవింద సమేతుడుగా రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ కాస్త విరామం తీసుకుని పిల్లలతో కాలక్షేపం చేస్తున్నట్టున్నాడు. సోషల్ మీడియా వచ్చాక ఏ చిన్న సరదా అయినా అభిమానులతో పంచుకుంటున్నారు సినీ స్టార్లు. పెద్ద కొడుకు అభయ్‌తో కలిసి చేసే అల్లరిని తారక్‌ వీడియో తీసి పోస్ట్ చేశారు.

When you become a #punchingbag for your son #karatekid #elderbrat #lazysunday

A post shared by Jr NTR (@jrntr) on

‘నా కొడుక్కి నేనొక పంచింగ్ బ్యాగ్ అయ్యాను. వాడి బుజ్జి చేతులతో నన్ను బాదేస్తున్నాడు అంటూ సరదాగా క్యాప్షన్ కూడా పెట్టారు. కరాటే కిడ్’ అన్న హ్యాష్ ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఈ మధ్యే పుట్టిన  చిన్న కొడుకు భార్గవ్ రామ్ కూడా పెద్దయితే ఇద్దరన్నదమ్ములు కలిసి ఇల్లు పీకి పందిరేస్తారేమో.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -