ఫ్యూచర్‌ రిటైల్‌ ప్లస్‌-ఎల్‌ఐసీ హౌసింగ్‌ డౌన్‌

lic-housing-finance-ltd-stock-price-share-price

గూగుల్‌, పేటీఎం కంపెనీలో వాటాను కొనుగోలు చేయనున్న వార్తలతో కిశోర్‌ బియానీ గ్రూప్ సంస్థ ఫ్యూచర్‌ రిటైల్‌ జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కళకళలాడుతోంది. మరోపక్క ఈ ఏడాది(218-19) క్యూ1లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వివరాలు చూద్దాం..

ఫ్యూచర్‌ రిటైల్‌
ఇంటర్నెట్‌ దిగ్గజం గూగుల్‌, పేటీఎం కంపెనీలో వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెలువడ్డ వార్తలు ఫ్యూచర్‌ రిటైల్‌ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసి రూ. 534 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో 6 శాతం దూసుకెళ్లి గరిష్టంగా రూ. 552ను తాకింది. గూగుల్‌తోపాటు ఈవాలట్‌ దిగ్గజం పేటీఎం సంయుక్తంగా ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. 7-10 శాతం మధ్య వాటా కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. డీల్‌ విలువను రూ. 3500-4000 కోట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌ రిటైల్‌లో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వాటా కొనుగోలుకి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఎల్‌ఐసీ హౌసింగ్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ నికర లాభం 18 శాతంపైగా ఎగసి రూ. 568 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 4019 కోట్లను తాకింది. కాగా.. విదేశీ బ్రోకింగ్‌ సంస్థ జేపీ మోర్గాన్‌ ఈ షేరు రేటింగ్‌ను న్యూట్రల్‌గా ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే 9 శాతం తక్కువగా రూ. 520 టార్గెట్‌ ధరను ప్రకటించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ షేరు దాదాపు 7 శాతం పతనమైంది. రూ. 535 వద్ద ట్రేడవుతోంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.