ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడి కుమారుడిగానే కాకుండా ఏపీ ఐటీ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న లోకేష్, నటుడు మామయ్య కూడా అయిన బాలకృష్ణ కుమార్తె బ్రహ్మణిని వివాహం చేసుకుని 11 సంవత్సరాలు అయింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని లోకేష్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో తన మనసులో మాటని పంచుకున్నారు. గత 11 సంవత్సరాలుగా తన భార్యనుంచి ప్రేమ, ఆప్యాయతలు లభిస్తున్నాయని, తనకు దేవుడిచ్చిన గొప్పవరంగా బ్రహ్మణిని అభివర్ణించారు.

ఆమెకు లోకేష్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరికి విషెస్ తెలిపారు.