అక్క రాఖీ కట్టలేదని.. బావ అన్నను హత్య చేసిన యువతి తమ్ముడు!

man-murdered-in-east-godavari

ప్రేమ పెళ్లితో అక్క తనకు దూరమైందని ఓ యువకుడు మనస్తాపం చెందాడు. నిన్న రాఖీ పూట అక్కను కలవలేకపోయినందుకు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తమ కుటుంబానికి అక్కను దూరం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలనున్నాడు. బావ అన్నయ్యపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఏడపల్లిలో ఈ ఘటన జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరానికి చెందిన కిషోర్, నరసింహమూర్తి సోదరులు. ఏడపల్లి ఇసుక క్వారీలో ఇద్దరూ కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఈ సమయంలోనే నరసింహమూర్తి, లలిత అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఈ నెల 23న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహాన్ని లలిత కుటుంబం అస్సలు ఒప్పుకోలేదు. ఐతే.. పెద్దల్ని ఎదిరించి వీళ్లు ఒక్కటయ్యారు. దీంతో, లలిత తమ్ముడు కోపం పెంచుకున్నాడు. పైగా నిన్న రాఖీ పూట అక్కతో రాఖీ కట్టించుకునే అవకాశం లేకుండా పోయినందుకు కోపంతో రగిలిపోయాడు. పెద్దలు కాదన్నా ఈ పెళ్లి జరిపించి, తనకు అక్కను దూరం చేశాడన్న ఆగ్రహంతో బావ సోదరుడు కిషోర్‌ను హత్య చేశాడు.