కోరిక తీరిస్తేనే పాసవుతారంటూ కాలేజీ డైరెక్టర్‌ బ్లాక్ మెయిలింగ్

విద్యాబుద్దులు నేర్పే సంస్థకు డైరెక్టర్‌ అతను. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన పిల్లలను కామవాంచతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. మార్కులు కావాలంటే చెప్పినట్లు వినాల్సిందే అంటూ బెదిరిస్తున్నాడు. కోరిక తీరిస్తేనే పరీక్షల్లో పాసవుతావంటూ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నాడు. విశాఖ ఒకేషనల్‌ కాలేజ్‌లో జరుగుతున్న ఈ వేధింపుల పర్వం తాజాగా వెలుగు చూసింది. డైరెక్టర్‌ కుమార్‌పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, కాలేజీ ప్రిన్సిపల్‌ గ్లోరిల ఒక మహిళ అయ్యుండి కూడా డైరెక్టర్‌కు వత్తాసు పలకడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్‌ కుమార్‌నే సపోర్ట్‌ చేసి మాట్లాడుతోందని ఆరోపిస్తున్నారు. కాలేజ్‌ డైరెక్టర్‌ కుమార్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -