కేరళ బాధితుల కోసం సల్మాన్ ఖాన్ భారీ విరాళం..?

భారీవర్షాలతో కకావికలమైన కేరళను అదుకోవడం కోసం పలువురు సెలబ్రెటిలు భారీ విరాళాలను అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ బాధితుల కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 12 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు నటుడు జావేద్ జాఫెరీ తన ట్విటర్‌లో తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్యాత జావేద్‌ ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేశారు.

అనంతరం జావేద్‌ మరో ట్వీట్‌ చేశారు. ‘ సల్మాన్‌ ఖాన్‌ 12 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారనే వార్తను కొందరు వ్యక్తుల ద్వారా నేను విన్నాను. బాధితులను అదుకోవడంలో సల్మాన్ ఖాన్ ఎప్పుడు ముందే ఉంటారు కాబట్టి కేరళ బాధితుల కోసం తన వంతు సహయాన్ని ప్రకటించి ఉంటారాని ట్వీట్‌ చేశాను. అయితే ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం నాకు తెలియదు’ అంటూ జావేద్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.