అందరి చూపూ సెప్టెంబర్‌ 2 పైనే…

అందరి చూపూ సెప్టెంబర్‌ 2 పైనే ఉంది. టి.ఆర్.ఎస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించే సభ నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లా కొత్త కలక్టరేట్‌ దగ్గర.. కొంగరకొలను దగ్గర సభ ఏర్పాటు చేస్తున్నారు.. సభ నిర్వహనకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి..

ట్రాఫిక్‌ జామ్‌కు అవకాశం లేకుడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా త్వరితగతిన పని జరుగుతోంది. 50 జేసీబీల ను ఏర్పాటు చేసి సభా స్థలాన్ని చదును చేయిస్తున్నారు. ప్రస్తుం అక్కడ విద్యుత్‌ సదుపాయం లేదు. దీంతో విద్యుత్‌ లైన్లు వేస్తున్నారు. సభ ముందు, వెనుక పైపు కూడా పనులు జరుగుతున్నాయి..మంత్రలకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రముఖులకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు.

ఎడమవైపు హెలీప్యాడ్‌ పనులు జరుగుతున్నాయి. చుట్టు చెట్లు ఉండేవి.. బాంబ్‌, డాగ్‌ స్కాడ్‌లు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే సభా స్థలం పోలీసుల ఆధీనంలో ఉంది..