వారెవ్వా… అదానీ గ్రూప్‌ షేర్ల హవా!

వరుసగా రెండో రోజు సరికొత్త గరిష్టాలను అందుకుని పటిష్ట లాభాలతో సాగుతున్న మార్కెట్లో ఉన్నట్టుండి గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో గ్రూప్‌లో పలు షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. అంతేకాకుండా భారీ స్థాయిలో లావాదేవీలు సైతం నమోదవుతుండటం గమనార్హం. ఇవీ ఇతర వివరాలు..

అదానీ ట్రాన్స్‌మిషన్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 17 శాతం దూసుకెళ్లింది. రూ. 35 ఎగసి రూ. 238 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 240 వద్ద గరిష్టాన్నీ.. రూ. 201 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. కాగా.. ఈ షేరు గత రెండు రోజుల్లో 40 శాతం జంప్‌చేసింది. ఈ నెల 24న అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు రూ. 169 వద్ద ట్రేడయ్యింది. ఈ కౌంటర్లో మిడ్‌సెషన్‌కల్లా ఐదు రెట్లు అధికంగా 1.25 కోట్ల షేర్లు చేతులు మారడం విశేషం!

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 9.4 శాతం దూసుకెళ్లింది. రూ. 20 ఎగసి రూ. 232 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఇంట్రాడేలో రూ. 209 వద్ద కనిష్టాన్నీ చవిచూడం గమనార్హం! కాగా.. వాటాదారులకు అదానీ గ్యాస్‌ షేర్ల కేటాయింపు చేపట్టేందుకు సెప్టెంబర్‌ 7 రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది.

అదానీ పవర్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6.6 శాతం జంప్‌చేసింది. రూ. 35.70 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. రూ. 32.50 వద్ద కనిష్టానికీ చేరింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 58.25 వద్ద ఫ్రీజయ్యింది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. రూ. 55.35 వద్ద కనిష్టాన్నీ తాకింది.

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌: ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 1.4 శాతం బలపడింది. రూ. 384 వద్ద ట్రేడవుతోంది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. రూ. 376 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది!

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -