తుదిపోరులో ‘సింధు’ ఓటమి…రజతంతో సరి

PV SINDHU

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో తెలుగుతేజం పివి సింధు రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన సింధు తుదిపోరులో నిరాశపరిచింది. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తైజుయింగ్ వరుస గేమ్స్‌లో సింధు నిలువరించి స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్‌లో అద్భుతంగా ఆడిన సింధు ఫైనల్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్టు ఆడలేకపోయింది. అయితే రజతం గెలవడం ద్వారా ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్‌ తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.