వందకోట్ల క్లబ్ లో ‘గీత గోవిందం’ ఏరియావైజ్ కలెక్షన్స్..

geetha-govindam-storms-box-office-enters-100-crore-club

గీత గోవిందం.. సెంచరీ కొట్టింది. ఇప్పుడు చాలామంది స్టార్స్ కు సాధ్యం కానంత తక్కువ టైమ్ లో ఈ మూవీ సెంచరీ కొట్టింది. ఇప్పటికే డే వన్ నుంచే కలెక్షన్స్ విషయంలో ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తోన్న గీత గోవిందం వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోయింది. దీంతో అతి తక్కువ టైమ్ లోనే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశాడు. మామూలుగా ఈ మూవీ 60-70 గ్రాస్ తో ఆగిపోతుందనుకున్నారు చాలామంది. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఏకంగా సెంచరీ కొట్టేసింది. కేవలం 12 రోజుల్లో 102 కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. అంటే 52.11 కోట్ల షేర్ తో ఈ సినిమా తీసిన వారికి, కొన్నవారికి భారీ లాభాలు తెచ్చిందన్నమాట.

నైజాం 15.45 కోట్లలో
సీడెడ్ 5.10
వైజాగ్ 4.70
ఈస్ట్ 2.97
వెస్ట్ 2.45
కృష్ణా 2.98
గుంటూరు 3.5
నెల్లూరు 1.09
కర్ణాటక 3.84
చెన్నయ్ 1.72
రెస్టాఫ్ ఇండియా 1.29
ఓవర్ సీస్ 7.00
మొత్తం షేర్ : 52. 11 కోట్లు
గ్రాస్ : 102 కోట్లు

- ఉచితంగా మీ జాతకాన్ని తెలుసుకోండి -