సీతారాములు.. జగనన్నభారతమ్మలు: రోజా విషెస్

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు సందర్భంగా నగరి ఎమ్మెల్యే, పార్టీ మహిళా నేత రోజా శుభాకాంక్షలు తెలియజేసారు.

తమ ప్రియతమ నాయకుడు జగన్, భారతిల పెళ్లి నాటి ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. జగన్‌ దంపతులను సీతా రాములుగా అభివర్ణించారు. సీతమ్మ లాంటి భార్య దొరికినందుకు జగనన్నకి, రాముడి లాంటి భర్త దొరికినందుకు భారతమ్మకి.. ఇద్దరికీ హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలంటూ పోస్ట్ పెట్టారు.

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.