పామే పరుపుగా.. దానిపై కోడి దర్జాగా..

పాములంటే మనుషులకే కాదు జంతువులకి, పక్షులకి కూడా భయమే. దాన్ని చూస్తే ఆమడ దూరం పారిపోతాయి. ఎక్కడ తమ అందమైన పొదరింట్లోకి గప్‌చిప్‌గా దూరి గుడ్లను గుటకాయస్వాహా చేస్తుందో అని తల్లి మనసు తల్లడిల్లుతూనే ఉంటుంది. ఓకంట కనిపెడుతూ ఉండమని మగపక్షులకు కూడా చెప్పి ఆహారం కోసం బయటకు వెళుతుంటుంది ఆడపక్షి. మరి ఇక్కడ ఏకంగా ఓ కోడి గుడ్లను పొదగడానికి కూర్చున్నట్లుగా పాము మీద కూర్చుంది దర్జాగా.

పోయిన జన్మలో తామిద్దరికీ ఏదో బంధం ఉందన్నంత ఆనందంగా కూర్చుంది ఏ మాత్రం భయం లేకుండా. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి చెందిన ఓ గ్రామంలో సారా అలిసన్ అన మహిళకు కోళ్ల ఫారం ఉంది. సాధారణంగా కోళ్లు ఉన్న చోటుకి పాములు వస్తుంటాయి. యజమానులతో పాటు కొళ్లు కూడా వాటి భారి నుంచి పిల్లలను, గుడ్లను కాపాడుతుంటాయి. ఒక్కోసారి బొరియల్లోని ఎలుకలను తినడానికి క్కూడా పాములు వస్తుంటాయి.

అలానే పాము వచ్చిందనుకుందట అలిసన్. కానీ పాము చుట్టగా చుట్టుకుని గూట్లో కూర్చుని వుంటే దానిపైన వెచ్చగా కూర్చొని ఉన్న కోడిని చూసేసరికి దడుచుకుని ఒక్క ఉదుటన పరుగులు తీసింది అలిసన్. ఈ రోజు కోడి పని అయిపోయింది అని ఇంట్లో వారితో చెప్పింది. కానీ విచిత్రంగా పాము కోడిని ఏమీ చేయకుండా తన దారిన తాను వెళ్లిపోయింది. కోడి బతికిపోయింది. అలిసన్ ఊపిరి పీల్చుకుంది.