భూమా వారింట పెళ్లి సందడి.. (ఫోటోలు)

భూమా వారింట పెళ్లి సందడి మొదలైంది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ పెళ్లి కూతురయ్యారు. రాయలసీమలో ప్రముఖ విద్యా సంస్థలు నడుపుతున్న భార్గవ్‌ రామ్‌ను అఖిల పెళ్లి చేసుకోబోతున్నారు. కర్నూలు జిల్లాలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా ఈ వివాహ వేడుకను జరిపేందుకు భూమా కుటుంబం ఏర్పాట్లు చేసింది..

 BHUMA akhilapriya PELLI

వైభవంగా జరగనున్న ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరు కానున్నారు. వివాహ వేడుకకు ఆళ్లగడ్డలోని శోభానాగిరెడ్డి ఇంజనీరింగ్‌ మెమోరియల్‌ కళాశాల ప్రాంగణం సిద్ధమైంది.

మంత్రి అఖిల ప్రియ వివాహానికి దాదాపు 40 వేల వివాహ ఆహ్వాన పత్రికలను అందజేశారు. తెలుగు రాష్ట్రల గవర్నర్‌ నరసింహన్‌, ఏపీ సీఎం చంద్రబాబులతో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.. పెళ్లిలో రాయలసీమ రుచులతో పాటు, ఆయా జిల్లాల ప్రత్యేక వంటకాలను అతిథులకు విందుగా పెట్టనున్నారు.