విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆపై దారుణ హత్య

మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైన వైష్ణవి కిడ్నాప్‌ ఘటన విషాదాంతంగా ముగిసింది. అదృశ్యమైన మరునాడే వైష్ణవి శవమై కన్పించింది. హైదరాబాద్ శివారులోని బాలాపూర్ మండలం అల్మాస్‌గూడలో ఈ అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. బాలిక ఒంటిపై గాయాలు ఉండడంతో దుండగులు అత్యాచారయత్నం చేసి అనంతరం హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోజులాగే ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన 8వ తరగతి విద్యార్ధిని వైష్ణవి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే సోమవారం అల్మాస్‌గూడ చర్చి సమీపంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు వైష్ణవి తల్లిదండ్రులు సమాచారం అందించారు. మృతదేహాన్ని తన కూతురుగానే గుర్తించిన వైష్ణవి తల్లిదండ్రులు బోరునా విలపించారు. వైష్ణవి మిస్టరీ డెత్‌పై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.