ఇకపై జీన్స్, కార్గోలు ధరించరాదంటూ..

మంచి అనుకున్నదాన్ని ముందు మనం ఆచరిస్తే ఒకరికి చెప్పే అధికారం ఉంటుంది. అదే పని చేసింది త్రిపుర ప్రభుత్వం. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నత స్థాయికి చెందిన అధికారులు, జిల్లా కలక్టర్లు, ఏడీఎంలతో పాటు జిల్లాల ఉన్నతాధికారులు విధిగా డ్రెస్ కోడ్ పాటించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు రెవెన్యూ, విద్య, సమాచార, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుశీల్ కుమార్ మెమొరాండం జారీ చేశారు. అధికారిక సమావేశాలకు క్యాజువల్ దుస్తులు ధరించకూడదంటూ సమావేశాలని కూడా క్యాజువల్‌గా తీసుకోకుండా సీరియస్‌గా తీసుకోండి అని అంటున్నారు.

ఇకపోతే ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ చూస్తూ, చాటింగులు చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి అమర్యాదక పనులు చేస్తూ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులంతా ప్రజా శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలన్నారు.