క్రికెటర్‌తో అఫైర్‌: రాశీ ఖన్నా క్లారిటీ

ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇష్టమైన క్రికెటర్ ఎవరంటే బూమ్రా పేరు చెప్పాను. ఇక దాంతో అతడిని ప్రేమిస్తున్నానంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకండి ఇలా ప్రచారం చేస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది రాశీఖన్నా. సినిమాల్లో నటించే హీరోలతో అయితే చెప్పక్కర్లేదు. ప్రతి హీరోతో రొమాన్స్ చేస్తున్నట్టు చెప్పేసుకుంటారు.

నటించే వారితో స్నేహం గా ఉండడం తప్పని సరి అంత మాత్రం చేత దానికి లవ్వు మరొకటి అంటూ సంబంధాలు అంటగట్టడం భావ్యం కాదంటోంది. బాలీవుడ్ అవకాశాల గురించి మాట్లాడుతూ, భవిష్యత్తులో నటిస్తానేమో తెలియదు కానీ ఇప్పటికైతే అలాంటి ఆలోచన లేదని ఇక్కడ తన కెరీర్ బాగానే ఉందని తెలిపింది.