తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్..

telangana-premier-kabaddi-league

తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్‌కు సరూర్‌నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త జట్లతో పాటు అన్ని టీమ్స్‌కు సంబంధించిన ఓనర్స్‌, కోచ్ , కెప్టెన్ల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడలో తెలంగాణా నుంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌ను ప్రోత్సహించే ఉధ్ధేశంతోనే టిపికెఎల్‌ నిర్వహిస్తున్నట్టు లీగ్ కమీషనర్ సంజయ్‌రెడ్డి చెప్పారు. యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా అభివర్ణించారు. చింతల స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌ రెండో సీజన్‌ మ్యాచ్‌లను టీవీ 5 లైవ్‌ టెలికాస్ట్ చేయనుంది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.