కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ

ttd board meeting updates

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో టీటీడీ నిర్మిస్తున్న శ్రీవారి నూతన ఆలయానికి 150 కోట్లు మంజూరు చేస్తూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. అలాగే 79 కోట్లతో తిరుమల గోవర్ధన అతిథి గృహం వద్ద నూతన యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా 2015లో సవరించిన పీఆర్‌సీ ప్రకారం టీటీడీ రవాణా విభాగంలోని 80 మంది కార్మికులకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలో ఫాస్ట్‌ ఫుడ్, హోటల్స్‌లో అధిక రేట్ల నియంత్రణకు ఐదుగురు సభ్యులతో కమిటీ నియమించారు. ఒంటిమిట్టలోని యాత్రికుల వసతి గృ‌హాన్ని ఏపీ టూరిజంకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కల్యాణమండపాల నిర్వహణకు రూ.35 కోట్లు కేటాయించారు. తిరుపతిలోని రామకృష్ణ మిషన్ భవనాల కాంట్రాక్టును మరో 3 సంవత్సరాలు పొడిగించారు.