అమెరికాలో భక్తిశ్రద్దలతో వరలక్ష్మి వ్రతం

varalakshmi vratham in usa

అమెరికాలోని న్యూజెర్సీలో వరలక్ష్మివ్రతాన్ని ఎన్నారై మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించుకున్నారు. నార్త్ బ్రౌన్స్ విక్ లోని సాయిపరివార్ మందిర్ లో నిర్వహించిన వేడుకల్లో ప్రవాస భారతీయ మహిళలు భక్తిశ్రద్దలతోపూజలు చేశారు. సాంప్రదాయబద్దంగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో వ్రతాన్ని నిర్వహించారు. అమెరికాలోను సాంప్రదాయబద్దంగా వరలక్ష్మి పూజ నిర్వహించుకోవడం తమకు చాలా సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు.