మహిళా జర్నలిస్టు దారుణ హత్య…

ఓ టీవీ చానెల్‌కు చెందిన మహిళా జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లోని పాబ్నా ప్రాంతంలో చోటుచేసుకుంది. అనంద టీవీ చానల్ పనిచేస్తున్న 32 ఏళ్ళ మహిళ జర్నలిస్టు సువర్ణను దుండగులు విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు.సువర్ణకు తొమ్మిదేళ్ల కుమార్తె కూడా ఉంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా విడాకులు పొందేందుకు గత కొంతకాలంగా ఆమె ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో మంగళవారం రాత్రి 12 మంది దుండగులు ఆమె నివాసంపై దాడిచేసినట్టు పాబ్నా ఏఎస్పీ మిజాన్ తేలిపారు ప్రత్యేక బృందాలతో నిందుతుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.